సినిమా వార్తలు
ట్యాగ్ · 41 కథనాలు · పేజీ 3
సినిమా వార్తలు
సామ్-రానా లకు ఫిదా పిల్ల ఛాలెంజ్..!
'ఫిదా' సినిమాతో అందరినీ ఫిదా చేసిన భాన్సువాడ భానుమతి అదే సాయి పల్లవి సమంతకు, రానాకు ఓ ఛాలెంజ్ విసిరింది. ఇంతకు ఆ ఛాలెంజ్ ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. తెలంగాణా రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ 'గ్రీన్ ఛాలెంజ్' పేరిట ఓ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సెలెబ్రిటీస్ కూడా మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలో అక్కినేని అఖిల్ కూడా తన వంతుగా మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ ను నాగ చైతన్య, వరుణ్ కు విసిరాడు.