
ట్యాగ్ · 2 కథనాలు


ఓవర్ సీస్ లో బ్రేక్ ఈవెన్ దిశగా "ఆర్ ఆర్ ఆర్ "
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.

'ఆర్ఆర్ఆర్'.. వారం రోజుల్లో 710 కోట్లు..!
కొన్ని సినిమాలు సినిమా రిలీజ్ అయిన తరువాత రికార్డులు క్రియేట్ చేస్తే.. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు మాత్రం సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్ తోనే సంచలనాలు సృష్టించింది ఈసినిమా. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. ఎన్నో అంచనాల మధ్య మార్చి 25న రిలీజ్ అయిన ఈసినిమా సంచలన విజయం సాధించింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా చాలా మంది ఈసినిమాపై స్పందించి ప్రశంసలు కురిపించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు నార్త్ లో కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో…