
ట్యాగ్ · 2 కథనాలు

సోషల్ మీడియాలో ప్రభాస్ మరో రికార్డ్

15 వసంతాల "ఛత్రపతి "
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , శ్రియ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఛత్రపతి " మూవీ 2005 సంవత్సరం సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. డ్యాన్స్ , యాక్షన్ , ఎమోషనల్ సీన్స్ లో ప్రభాస్ తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రశంసలు అందుకున్నారు. కీరవాణి స్వరపరిచిన సాంగ్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
సోషల్ మీడియాలో ప్రభాస్ మరో రికార్డ్
సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇటీవల ప్రభాస్ ట్విట్టర్ లో మిలియన్స్ లలో అభిమానులను సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేయగా.. ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరో రికార్డు ను సొంతం చేసుకున్నాడు.