
సినిమా వార్తలు
ట్యాగ్ · 2 కథనాలు



మాస్ మహారాజా రవితేజ -హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం మిస్టర్ బచ్చన్.సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇంకో 20శాతం షూటింగ్ బ్యాలెన్స్ వుంది.ఈనెలలో దాన్నికూడా ఫినిష్ చేయనున్నారు.ఇక ఈసినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ దక్కించుకుంది.త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదలకానుంది.రీసెంట్ గా దానికి సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.

రవితేజ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమా ఈగల్. ఈసినిమా అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా కూడా రవితేజ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టేశాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్ సినిమా. ఈసినిమా హిందీలో వచ్చిన రెయిడ్ సినిమాకు రీమేక్ అంటున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయింది.