
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


దక్షిణాది భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. రష్మిక ప్రస్తుతం ""పుష్ప :ది రూల్ ", బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ స్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ "పుష్ప :ది రైజ్ " హిందీ డబ్బింగ్ వెర్షన్ తో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.