
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి . సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న "ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” మూవీ తో రష్మిక బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. బిగ్ బీ అమితాబ్ , రష్మిక ప్రధాన పాత్రలలో తండ్రీ కూతుళ్ళ నేపథ్యం లో “గుడ్ బై “బాలీవుడ్ మూవీ తెరకెక్కుతుంది.