
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


అన్నదమ్ముల సెంటిమెంట్‌తో తెలుగునాట పలు చిత్రాలు సందడి చేశాయి. వాటిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ‘రంగస్థలం’ ఒకటి. ఇందులోని “చిట్టిబాబు” పాత్రలో చరణ్ అభినయించిన తీరు విమర్శకులను సైతం కట్టిపడేసింది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ 80లనాటి పిరియాడిక్ యాక్షన్ డ్రామాలో సమంత కథానాయికగా నటించింది. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, నరేష్, అనసూయ భరద్వాజ్, రోహిణి, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించగా... స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో నర్తించింది.