ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
రాశీ ఖన్నా పుట్టిన రోజు - 'వెంకీ మామ' నుండి స్పెషల్ గిఫ్ట్
బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికీ కాస్త కన్ఫ్యూజన్ వుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ విడుదల చేశారు. రీసెంట్ గా నాగ చైతన్య పుట్టిన రోజున నాగ చైతన్య చేస్తున్న కెప్టెన్ కార్తీక్ రోల్ కి సంబంధించి ఓ వీడియో విడుదల చేయగా ఈ రోజు రాశి ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా 'వెంకీమామ' టీమ్ ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా నుంచి తనకు సంబంధించిన ఒక డైలాగ్ వీడియోను విడుదల చేశారు.