
ట్యాగ్ · 3 కథనాలు


ఆహాలోకి ప్రసన్నవదనం

ఓటీటీలోకి వచ్చేసిన ప్రసన్నవదనం
టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులలో యంగ్ హీరో సుహాస్ ఒకడు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'ప్రసన్నవదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటించగా.. నితిన్ ప్రసన్న కీలక పాత్ర పోషించారు. కాగా 'ప్రసన్నవదనం’ చిత్రాన్ని లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్లపై మణికంఠ, ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

ఆహాలోకి ప్రసన్నవదనం
హీరోగా వరస సినిమాలతో ఫుల్ బిజీగా వున్న నటుడు సుహాస్ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమా ప్రసన్నవదనం.ఈఏడాది ఇది తనకు మూడో రిలీజ్.ఈసినిమాకు ముందు సోలో హీరోగా వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హిట్ అనిపించుకుంది.ఈనెల స్టార్టింగ్ లో థియేటర్లలోకి వచ్చిన ప్రసన్న వదనం కూడా పాజిటివ్ రివ్యూస్ తో డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి రానుంది.ఆహా ఈసినిమా ను ఈనెల 24నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.ఆహా గోల్డ్ వున్న వారు 24గంటల ముందే చూసేయొచ్చు.

ప్రసన్నవదనం.. మైత్రీ చేతికి తెలంగాణ, తమిళనాడు రిలీజ్ రైట్స్
టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తన ప్రతిభతో క్యారక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరో స్టార్డమ్ సొంతం చేసుకున్నవారు అతి తక్కువమంది ఉంటారు. అలాంటివారిలో సుహాస్ ఒకడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఒకవైపు కమెడియన్గా, విలన్గా నటిస్తూనే.. తొలిసారిగా 'కలర్ ఫోటో' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వరుసగా.. 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుకున్నాడు.