ట్యాగ్ · 2 కథనాలు

కాంబినేషన్ లో 'ప్రభాస్ 22'..?
ప్రభాస్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ "వర్షం "
సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శోభన్ దర్శకత్వంలో ప్రభాస్ , త్రిష జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "వర్షం "మూవీ 2004 సంవత్సరం జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రభాస్ , త్రిష అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.ఈ మూవీ లో హీరో గోపీచంద్ ప్రతినాయకుడిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో అన్ని సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా "నువ్వొస్తానంటే "సాంగ్ ఇప్పటికీ తరచూ వినిపిస్తూనే ఉంటుంది.

కాంబినేషన్ లో 'ప్రభాస్ 22'..?
ఒక పక్క బాహుబలి సిరీస్.. సాహూ సినిమాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరో ప్రభాస్.. మరోపక్క కె.జి.యఫ్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్.. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటది. ఆ ఊహే చాలా హై లో వుంది కదా. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటూ ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ కాంబోలో సినిమా రావడం గ్యారెంటీ అంటున్నాయి సినీ వర్గాలు. అంతేకాదు ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యిందని అంటున్నారు. అయితే ఈ సినిమా రావడానికి లేట్ అవ్వొచ్చు…