
సినిమా వార్తలు
ట్యాగ్ · 2 కథనాలు


ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్రభాస్ 20 సినిమా. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాకు ‘ఓ డియర్’ టైటిల్ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో.. ప్రభాస్ ఓ సూపర్ హీరోలా కనిపిస్తాడని సమాచారం.