
ట్యాగ్ · 2 కథనాలు

"పొన్నియిన్ సెల్వన్ "మూవీ అప్ డేట్

"పొన్నియిన్ సెల్వన్ "షూటింగ్ పూర్తి
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయంరవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్ లతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
"పొన్నియిన్ సెల్వన్ "మూవీ అప్ డేట్
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్, త్రిష , శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలలో కల్కి కృష్ణ మూర్తి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా చోళ రాజవంశం నేపథ్యంలో హిస్టారికల్ డ్రామా "పొన్నియిన్ సెల్వన్" మూవీ 2 భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.