
ట్యాగ్ · 3 కథనాలు


ఐమ్యాక్స్ ఫార్మాట్ లో తొలి తమిళ మూవీ పొన్నియిన్ సెల్వన్1
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

'పొన్నియన్ సెల్వన్' త్రిష ఫస్ట్ లుక్ రిలీజ్..!
మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పొన్నియన్ సెల్వన్. ఈసినిమా చోళరాజుల కాలానికి సంబంధించిన నేపథ్యంలో.. ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుండగా.. మరోపక్క ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో చిత్రబృందం వరుసగా అప్‌డేట్‌లను ఇస్తుంది. ప్రతిరోజు ఈసినిమాలో నటించిన నటీనటుల పోస్టర్‌లను విడుదల చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే విక్రమ్, జయం రవి, కార్తీ లుక్‌లు విడుదలవ్వగా.. నిన్న ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రంలోని త్రిష ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను…

'పొన్నియన్ సెల్వన్' ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
చాలా గ్యాప్ తరువాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'పొన్నియిన్ సెల్వన్'. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా మణిరత్నం ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటివరకూ తాను సినిమాలకు భిన్నమైన జోనర్ లో ఈసినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాఉన్నాయి. ఇక ఈసినిమా మొదలుపెట్టిన తరువాత కూడా కరోనా కారణంగా, ఇతర కారణాల వల్ల చాలా బ్రేకులే పడ్డాయి. ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.