
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


దాదాపు 3 సంవత్సరాలు గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ లాయర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. వరస మూవీ కమిట్ మెంట్స్ తో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. “హరిహర వీరమల్లు “ మూవీ 2022 సంవత్సరం జనవరి లో రిలీజ్ కానుంది.