
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


స్వరూప్ ఆర్ఎస్ జె దర్శకత్వంలో తెరకెక్కిన ”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీతో నవీన్ పోలిశెట్టి హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ సక్సెస్ అందుకుంది. హీరో నవీన్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. నవీన్ హీరోగా రూపొందిన "జాతిరత్నాలు "మూవీ ఘనవిజయం సాధించడంతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారారు.