ట్యాగ్ · 1 కథనాలు
ఫస్ట్ లుక్
'మోసగాళ్ళు' నుండి ఇంట్రెస్టింగ్ పోస్ట్ - అర్థనారీశ్వర అవతారంలో విష్ణు, కాజల్
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటిక విష్ణు, కాజల్ ఫస్ట్, సునీల్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ లు రిలీజ్ చేయగా తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ డిఫరెంట్ గా అందరినీ ఆకట్టుకుంటుంది.