
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


లాక్ డౌన్ వల్ల ప్రభుత్వాలు సడలింపులు చేయగా కొంతమంది తమ పనులకు వెళ్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీకి మాత్రం ఇంకా మంచి రోజులు రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కూడా.. అన్ని నిబంధనలతో షూట్ చేయడానికి పెద్దగా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ధైర్యం చేసి రాజమౌళి ట్రయిల్ షూట్ చేద్దామని రంగంలోకి దిగాడు కానీ.. రాజమౌళి చేతులెత్తేసినట్టు వార్తలు వచ్చాయి ఇప్పటికే. దీనితో జులై ఎండింగ్ వరకూ ఆగాల్సిందే. అయితే దీనివల్ల సినీ కార్మికులకు మాత్రం ఇబ్బందే అని చెప్పొచ్చు. షూటింగ్ లు మొదలైతే కాస్త కోలుకోవచ్చని అనుకున్నారు కానీ అది జరగలేదు. ఇక ఈ నేపద్యంలో సినీ కార్మికులకు సీసీసీ అండగా ఉంటుందని…