
ట్యాగ్ · 2 కథనాలు


మెగా 157 ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘మెగా 157’ వర్కింగ్ టైటిల్‌తో ఒక కొత్త చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు చిత్ర దర్శకుడు వశిష్ట సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అందులో.. " ‘మెగా 157’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. త్వరలోనే మీ అందరినీ సరికొత్త అనుభూతినిచ్చే సినిమాటిక్ అడ్వెంచర్‌కు తీసుకెళ్లేందుకు మేము సిద్ధం" అని వశిష్ట పేర్కొన్నారు. ఈ సందర్భంగా వశిష్ట ‘మెగా 157’ టీమ్‌తో కలసి దిగిన ఫొటోను షేర్ చే శారు. కాగా ఈ సినిమా సోషియో ఫాంటసీగా రూపొందనుంది.

మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నేడు కీలక ప్రకటన చేసింది. చిరంజీవితో కొత్త సినిమాను చేయనున్నట్లు ప్రకటించింది. తన తొలి చిత్రం ‘బింబిసార’తో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి మరో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవిని చూడాలని అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ అనౌన్స్ మెంట్ తో వారికి మెగా బర్త్ డే గిఫ్టును అందించినట్లయింది.