ట్యాగ్ · 2 కథనాలు
ఫైనల్ షెడ్యూల్ కోసం 'గోవా' లో క్రాక్ టీమ్
టాక్ ఆఫ్ ది టాలీవుడ్ "క్రాక్ "
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగావాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. లేడీ విలన్ గా పేరు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
ఫైనల్ షెడ్యూల్ కోసం 'గోవా' లో క్రాక్ టీమ్
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం 'క్రాక్'. 'క్రాక్' తో హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నారు వీరిద్దరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో స్టార్ట్ చేయగా కొంత భాగం అక్కడ చిత్రీకరించారు. ఇక కొంతభాగం మిగిలిఉండగా ఇప్పుడు అది కంప్లీట్ చేయడానికి చిత్రయూనిట్ గోవా వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని రవితేజ తన ఇన్స్టా ద్వారా తెలియచేశారు. ఫైనల్ షెడ్యూల్ కోసం గోవా వెళ్తున్నట్టు పోస్ట్ లో పేర్కొన్నాడు.