
ట్యాగ్ · 2 కథనాలు

దర్శకుడు మారుతి మరో మూవీ కి రెడీ

మరోసారి మెగా హీరోతోనే..?
హర్రర్ లో కూడా కామెడీని ఎలా పండించాలో చూపించిన దర్శకుడు మారుతి. తన కామెడీ టైమింగ్ తో హీరోలతో మంచి కమెడీ చేయించి హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గా మెగా హీరో సాయితేజ్ తో 'ప్రతిరోజూ పండగే' సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుత జనరేషన్ లో మెకానికల్ లైఫ్ కి అలవాటు పడ్డ పిల్లలు తమని ఈ స్థాయికి తీసుకువచ్చిన తల్లితండ్రులను మరిచిపోతున్నారన్న నేపధ్యంలో చక్కటి కుటుంబ సన్నివేశాలతో సినిమాని తెరకెక్కించాడు మారుతి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకుంది.
దర్శకుడు మారుతి మరో మూవీ కి రెడీ
"భలే భలే మొగాడివోయ్ " , "మహానుభావుడు " వంటి సూపర్ హిట్ మూవీస్ ఫేమ్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ప్రతి రోజూ పండగే " మూవీ ఘనవిజయం సాధించి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. దర్శకుడు మారుతి ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.