
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


సూపర్ స్టార్ మహేష్ బాబుకి అచ్చొచ్చిన స్వరకర్తల్లో మెలోడీ బ్రహ్మ మణిశర్మదే అగ్రశ్రేణి స్థానం. కథానాయకుడిగా మహేష్ తొలి చిత్రం `రాజకుమారుడు`తో మొదలుకుని... మహేష్ లో నటుడ్ని పరిపూర్ణంగా వెలికి తీసిన `మురారి`, తొలి బ్లాక్ బస్టర్ గా నిలచిన `ఒక్కడు`, `వన్ అండ్ ఓన్లీ` ఇండస్ట్రీ హిట్ అయిన `పోకిరి` వరకు... ఇలా పలు దశల్లో మణిశర్మ సంగీతం ముఖ్య భూమిక పోషించింది. `ఖలేజా` (2010) తరువాత మళ్ళీ ఈ కాంబినేషన్ లో మళ్ళీ పాటలు సందడి చేయనేలేదు. కాకపోతే, ఆ మధ్య `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` (2013)కి నేపథ్య సంగీతమందించాడు మణి.