
సినిమా వార్తలు
ట్యాగ్ · 21 కథనాలు · పేజీ 2


మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రముఖ నవలారచయిత కల్కీ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తుండటంతో మణిరత్నం కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈసినిమాకు నటీనటులను కూడా అదే రేంజ్ లో తీసుకున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. ఇప్పటికే డెబ్బై శాతం చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. మధ్యలో కోరనా వల్ల షూటింగ్ బ్రేక్ పడింది కానీ లేకపోతే ఈపాటికి షూటింగ్ పార్ట్ పూర్తయి ఉండేది. మళ్లీ ఇటీవలే షూటింగ్ ను మొదలుపెట్టాడు మణిరత్నం.