ట్యాగ్ · 2 కథనాలు
"మోసగాళ్ళు "ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాజల్ సందడి
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎ వి ఎ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ,సునీల్ శెట్టి ప్రధాన పాత్రలలో ఐటి స్కామ్ నేపథ్యంలో నిజ సంఘటనలతో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్ళు "మూవీ మార్చి 19 వ తేదీ రిలీజ్ కానుంది. రూహి సింగ్ , నవీన్ చంద్ర , నవదీప్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ లో కాజల్ , విష్ణు అక్కా తమ్ముడు గా నటించడం విశేషం. శామ్ సి ఎస్ సంగీతం అందించారు.
'మోసగాళ్ళు' ట్రైలర్ రిలీజ్ - సిస్టమ్‌ని ఆట ఆడించేవాడే కింగ్
గతకొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మంచు విష్ణు. దీనిలో భాగంగానే ఇప్పుడు మోసగాళ్ళు అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. ఈసినిమాలో కాజల్ అగర్వాల్ మంచు విష్ణుకు చెల్లెలిగా నటిస్తుండటం విశేషం. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం…