
ట్యాగ్ · 2 కథనాలు


ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ - మహేష్ బాబు

ఫ్యాన్స్, టీమ్ కు సూపర్ స్టార్ థ్యాంక్స్ నోట్..!
సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. దాదాపు రెండేళ్ల తరువాత మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వచ్చాడు. ఇక ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫైనల్ గా వారి ఎదురుచూపులకు ఫలితం దక్కింది. తన మేకోవర్ ను పూర్తిగా మార్చేసి తన స్టైలీ లుక్ తో, యాక్టింగ్ తో ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో కొత్తగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఈవిషయంలో పురశురామ్ కు క్రెడిట్ ఇవ్వా ల్సిందే. తనకు అవకాశం ఇచ్చినందుకు మహేష్ కు మంచి హిట్ అవ్వడమే కాకుండా కొత్తగా చూపించాడు. ఇక మరోవైపు ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ నే రాబడుతుంది…

ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ - మహేష్ బాబు
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక, అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. మహేష్ పుట్టిన రోజుసందర్భంగా సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన 'సర్కారు వారి పాట' టీజర్ మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. బర్త్ డే విషెస్ తో తనపై ప్రేమ కురిపించినందుకు "సర్కారు వారి పాట"బ్లాస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి వినయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.