
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. దాదాపు రెండేళ్ల తరువాత మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వచ్చాడు. ఇక ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫైనల్ గా వారి ఎదురుచూపులకు ఫలితం దక్కింది. తన మేకోవర్ ను పూర్తిగా మార్చేసి తన స్టైలీ లుక్ తో, యాక్టింగ్ తో ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో కొత్తగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఈవిషయంలో పురశురామ్ కు క్రెడిట్ ఇవ్వా ల్సిందే. తనకు అవకాశం ఇచ్చినందుకు మహేష్ కు మంచి హిట్ అవ్వడమే కాకుండా కొత్తగా చూపించాడు. ఇక మరోవైపు ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ నే రాబడుతుంది…