
ట్యాగ్ · 2 కథనాలు


"మేజర్" మూవీపై మహేష్ బాబు స్పందన

'మేజర్'.. మహేష్ తో రౌండ్ టేబుల్ మీట్..!
శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా మేజర్. సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ఇక ప్రివ్యూల నుండే ఈసినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈసినిమా కోసం పడిన కష్టానికి ప్రేక్షకులు విజయం అందించడంతో టీమ్ అంతా హ్యీపీగా ఉన్నారు. ప్రస్తుతం అయితే సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే పలు చిట్ చాట్ లు కూడా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమాను నిర్మించిన నిర్మాతల్లో ఒకరైన మహేష్ తో కూడా మేజర్ టీమ్ రౌండ్ టేబుల్ నిర్వహించింది. ఈసందర్భంగా చిత్రయూనిట్ ఈ రౌండ్ టేబుల్ లో పాల్గొని ఒక్కొక్కరి అనుభవాలను పంచుకున్నారు.

"మేజర్" మూవీపై మహేష్ బాబు స్పందన
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3 వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.USA లో…