
రిలీజ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో సిద్ధార్థ్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మహాసముద్రం. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు.. అలానే హే రంభ అంటూ వచ్చే సాంగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయి సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈసినిమా కూడా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. అక్టోబర్ 14వ తేదీన ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.