
ట్యాగ్ · 5 కథనాలు


సూపర్ స్టార్ కు పాన్ ఇండియా స్టార్ పరామర్శ

సూపర్ స్టార్ కృష్ణ మృతి పై ఎన్టీఆర్ స్పందన

ఒకే ఏడాది మూడు విషాదాలు

సూపర్ స్టార్ మృతి పై మెగా స్టార్ ఎమోషనల్ పోస్ట్

తాతపై సితార ఎమోషనల్ పోస్ట్
సూపర్ స్టార్ కృష్ణ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. మొన్న ఉదయం గుండెపోటుకు గురైన కృష్ణను కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి కాస్త విషమించడంతో నిన్న తెల్లవారు జామున కృష్ణ తుదిశ్వాస విడిచారు. ఈరోజు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా ముగిశాయి. ఇక ఇదిలా ఉండగా తాజాగా మనవరాలు కృష్ణ తన తాతను గుర్తుచేసుకొని సోషల్ మీడియా ద్వారా గుర్తుచేసుకుంది. వీక్ డే భోజనం మళ్లీ ఎప్పటికీ ఉండదు. మీరు నాకు చాలా విలువైన విషయాలు నేర్పించారు. ఎల్లప్పుడూ నన్ను నవ్వించారు, ఇప్పుడు మిగిలి ఉన్నది మీ జ్ఞాపకం. మీరు నా హీరో, ఏదో ఒక రోజు నేను మిమ్మల్ని గర్వపడేలా చేయగలనని…

సూపర్ స్టార్ కు పాన్ ఇండియా స్టార్ పరామర్శ
టాలీవుడ్ సూపర్ స్టార్. మహేష్ బాబు తండ్రి కృష్ణ కార్డియాక్ అరెస్ట్ తో మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆదివారం అర్థరాత్రి చేరిన కృష్ణ... చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ హీరోలు చిరంజీవి , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ , నాగ చైతన్య తదితరులు నటశేఖర్ కృష్ణ కి ఘన నివాళులర్పించారు, మహేష్ బాబును ఓదార్చుతూ ధైర్యం నింపారు.

సూపర్ స్టార్ కృష్ణ మృతి పై ఎన్టీఆర్ స్పందన
కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న కృష్ణను కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూశారు.సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త తెలిసిన అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నారు.

ఒకే ఏడాది మూడు విషాదాలు
ఒకటి కాదు రెండు కాదు ఈ ఏడాది మూడు విషాదాలు సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మహేష్ తీవ్ర విషాదాన్ని మిగిల్చి మరిచిపోలేని ఏడాదిగా మిగిలిపోయింది. ఈ ఏడాది ప్రారంభం జనవరిలో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించారు. కాలేయ సంబంధిత వ్యాదితో బాధపడుతున్న ఆయన పరిస్థితి కాస్త విషమించడంతో మరణించారు. ఇక ఆ బాధ నుండి తేరుకోక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. కృష్ణ మొదటి భార్య, మహేష్ తల్లి పద్మావతి కొద్ది రోజుల క్రిందటే మరణించారు. సెప్టెంబర్ లో ఆమె మృతి చెందారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటపడుతున్నారు మహేష్ బాబు. ఇంతలోనే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది.

సూపర్ స్టార్ మృతి పై మెగా స్టార్ ఎమోషనల్ పోస్ట్
మొదటి తరం హీరోలు నందమూరి తారకరామారావు , అక్కినేని నాగేశ్వర రావు , కాంతారావు కాంబినేషన్ లో పలు సినిమాలలో నటించిన హీరో కృష్ణ , రెండవతరం హీరోలు శోభన్ బాబు , కృష్ణం రాజు కాంబినేషన్ లో నటించారు. మూడవతరం హీరోలు చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , సుమన్ , రవితేజ ల కాంబినేషన్ లో కృష్ణ నటించారు. చిరంజీవి , కృష్ణ కలసి కొత్త అల్లుడు , కొత్తపేట రౌడీ , తోడు దొంగలు మూవీస్ లో నటించారు.