
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ప్రభాస్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాధేశ్యామ్'. ఈసినిమా జనవరిలో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు భారీగానే ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగానే ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాట్లు జరుగుతుండగా.. అదే రోజు ఫ్యాన్స్ తో ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు.