కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Krack Movie Details

ట్యాగ్ · 3 కథనాలు

షూటింగ్ అప్‌డేట్

ఫైనల్ షెడ్యూల్ కోసం 'గోవా' లో క్రాక్ టీమ్

మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మూడో చిత్రం 'క్రాక్‌'. 'క్రాక్' తో హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నారు వీరిద్దరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో స్టార్ట్ చేయగా కొంత భాగం అక్కడ చిత్రీకరించారు. ఇక కొంతభాగం మిగిలిఉండగా ఇప్పుడు అది కంప్లీట్ చేయడానికి చిత్రయూనిట్ గోవా వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని రవితేజ తన ఇన్స్టా ద్వారా తెలియచేశారు. ఫైనల్ షెడ్యూల్ కోసం గోవా వెళ్తున్నట్టు పోస్ట్ లో పేర్కొన్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న 'క్రాక్'

మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మూడో చిత్రం 'క్రాక్‌'. ఇటీవలే క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లో హీరో హీరోయిన్లు ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌పై ఓ పాట‌ను చిత్రీక‌రించ‌నున్నారట. ఆ పాట‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుందని చెపుతున్నారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

క్రాక్ నుండి రవితేజ కొత్త స్టిల్ రిలీజ్ - చివరి షెడ్యూల్ ప్లాన్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రాక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకొని గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఇప్పటీకే విడుదల చేసిన ర‌వితేజ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్