
ట్యాగ్ · 3 కథనాలు


'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా షూటింగ్ మొదలు

ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్న కిరణ్ అబ్బవరం
రాజావారు రాణిగారుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.ఈసినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.అయితే దీని తరువాత మూడు సంవత్సరాల గ్యాప్ లో ఏకంగా 7 సినిమాలతో వచ్చాడు.ఇందులో ఎస్ ఆర్ కల్యాణమండపం,వినరో భాగ్యము విష్ణు కథ మాత్రమే డీసెంట్ హిట్స్ అనిపించుకున్నాయి.ఇక తన చివరి సినిమా రూల్స్ రంజన్ కూడా నిరాశపరచడంతో లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు.అయితే వరసగా సినిమాలు ప్లాప్ కావడంతో ఈసారి కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం.

ప్రముఖ నిర్మాణ సంస్థల్లో 'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా
రాజా వారు-రాణీగారు, ఎస్‌ఆర్ కల్యాణ మండపం చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఇక ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడు. టాప్ ప్రొడక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. బాబీ, గోపీచంద్ మలినేనిల వద్ద ఎన్నో సినిమాలకు పనిచేసిన రమేష్ కాదూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఈసినిమాను ఎంతో మంది అగ్ర కథానాయకులతో, స్టార్ డైరక్టర్లతో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీమేకర్స్, ఇటీవల మత్తు వదలరా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా…

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా షూటింగ్ మొదలు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం సైలెంట్ గా ఒక సినిమా తర్వాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే SR కళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. ఇక ఇదిలా ఉండగా తాజాగా కిరణ్ మరో సినిమాను ప్రారంభించాడు. కిరణ్ హీరోగా కార్తీక్ శంకర్ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. ఇక నేటి నుండి ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించింది.