
ట్యాగ్ · 2 కథనాలు

ఖైదీ మూవీ టీమ్ కు మహేష్ బాబు అభినందనలు

50 రోజుల "ఖైదీ " మూవీ
డ్రీమ్ వారియర్స్, వివేకానంద పిక్చర్స్ బ్యానర్స్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా " ఖైదీ " మూవీ తమిళ, తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. " ఖైదీ " మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను సత్య సాయి ఆర్ట్స్ కె కె రాధామోహన్ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేశారు. ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.
ఖైదీ మూవీ టీమ్ కు మహేష్ బాబు అభినందనలు
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఖైదీ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 25 వ తేదీ రిలీజయి రెండు భాషలలోనూ విజయఢంకా మ్రోగిస్తోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఖైదీ మూవీ ని సత్య సాయి ఆర్ట్స్ KK రాధామోహన్ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేశారు . హీరోయిన్, సాంగ్స్ లేకుండా నైట్ ఎఫెక్ట్ లో తెరకెక్కిన ఖైదీ మూవీ కి ప్రేక్షకాదరణ లభించింది . వసూళ్ళ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఖైదీ మూవీ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.