
ట్యాగ్ · 4 కథనాలు


కల్కి-800 కోట్ల క్లబ్ తో బ్రేక్ ఈవెన్

తమిళనాడులో అదరగొడుతున్న కల్కి

హిందీలో ప్రభాస్ 6వ సారి

కల్కి.. నార్త్ అమెరికాలో సూపర్ రికార్డ్
టాలీవుడ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్‌లో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించారు. అలాగే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. ఇంకా మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

కల్కి-800 కోట్ల క్లబ్ తో బ్రేక్ ఈవెన్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కల్కి 2898ఏడీ. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలను నిజం చేస్తూ ఈసినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నటీనటుల నటన, వావ్ అనిపించేలా విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

తమిళనాడులో అదరగొడుతున్న కల్కి
కల్కి 2898 ఏడి ప్రభంజనం కొనసాగుతూనే వుంది.వీక్ డేస్ లో కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ అదరగొడుతుంది.ముఖ్యంగా తమిళనాడు లో సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది.మొదటి వారం లో ఈసినిమా 28కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని బ్రేక్ ఈవెన్ మార్క్ ను క్రాస్ చేసింది.ఫుల్ రన్ లో 40కోట్ల వరకు రాబట్టొచ్చు.రెండో వారంలో అక్కడ 400కుపైగా థియేటర్లలో కల్కి ప్రదర్శించబడుతుంది.ఇక కేరళ,కర్ణాటక లోకూడా సూపర్ వసూళ్లను దక్కించుకుంటుంది.ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.

హిందీలో ప్రభాస్ 6వ సారి
ప్రభాస్ హిందీలో మరోసారి 100కోట్ల క్లబ్ లో చేరాడు.బాహుబలి నుండి ప్రభాస్ కు నార్త్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.ఈసినిమా తరువాత ఒక్క రాధేశ్యామ్ తప్ప రిలీజ్ అయిన అన్ని సినిమాలు అక్కడ 100కోట్ల మార్క్ ను క్రాస్ చేశాయి.ఇక రీసెంట్ గా వచ్చిన కల్కి నిన్నటితో 100కోట్ల క్లబ్ లో చేరింది.నాలుగు రోజుల్లో ఈసినిమా 115 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.నిన్న ఒక్క రోజే హిందీ వెర్షన్ 42 కోట్ల నెట్ ను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.అంతేకాదు హిందీలో ఈఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కల్కి రికార్డు క్రియేట్ చేయనుంది.ప్రస్తుతానికి హృతిక్ రోషన్ ఫైటర్ 215 కోట్ల నెట్ తో మొదటి స్థానం లో వుంది.ఈవీక్ లో కల్కి ఆ…