
రిలీజ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటని చెప్పొచ్చు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-చరణ్ ప్రధాన పాత్రల్లో ఈ క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కింది. మూడేళ్లుగా ఈసినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎన్నో రిలీజ్ డేట్ లు మారాయి. ఇక ఫైనల్ గా ఈ ఏడాది సంక్రాంతికి ఈసినిమా విడుదల అవుతుందని అందరూ వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ కరోనా థర్డ్ వేవ్ వల్ల మళ్లీ రిలీజ్ కు బ్రేక్ పడింది. థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గడం.. దానికి తోడు కొన్ని చోట్ల థియేటర్లు కూడా మూత పడటంతో రిలీజ్ ను వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తామని ప్రకటించలేదు. కేవలం సరైన సమయం చూసుకొని విడుదల…