కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Indian 2 Movie Team

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

'ఇండియన్ 2' - మృతుల కుటుంబానికి కోటి విరాళం

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే ఈ సినిమాకు మొదటి నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఎలా షూటింగ్ మొదలైంది అనుకునే లోపు క్రేన్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో నాలుగు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ ఘటనతో మళ్లీ షూట్ కు బ్రేక్ పడింది. ఇక కేసులు.. విచారణలు అంటూ తిరిగేలోపు కరోనా వచ్చేసింది. దీనితో అసలు షూటింగులే లేకుండా పోయాయి.

TFN Adminవాట్సాప్

షేర్