
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 2 కథనాలు



యంగ్ హీరో రాజ్ తరుణ్, అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే హీరోయిన్ గా.. జి.ఆర్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ఇద్దరి లోకం ఒకటే'. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. ఈ సినిమాను డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్ర యూనిట్.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై జి ఆర్ కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్, షాలిని పాండే జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా "ఇద్దరి లోకం ఒకటే " మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. నాజర్, మాస్టర్ భరత్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.