
ట్యాగ్ · 2 కథనాలు

రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఇష్క్ "

దర్శకుడు తేజ కు నితిన్ బర్త్ డే శుభాకాంక్షలు
పలు హిందీ , తెలుగు సూపర్ హిట్ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన తేజ సూపర్ హిట్ "చిత్రం "మూవీ తో దర్శకుడిగా మారారు. పలు సూపర్ హిట్ మూవీస్ ను తెరకెక్కించిన దర్శకుడు తేజ పలువురు నటీ నటులను టాలీవుడ్ కు పరిచయం చేశారు. తేజ తన బర్త్ డే సందర్భంగా అభిరామ్ దగ్గుబాటి ని హీరోగా "అహింస " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఇష్క్ "
శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నితిన్ , నిత్య మీనన్ జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఇష్క్ " మూవీ ఘనవిజయం సాధించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. టైటిల్ కు తగ్గట్టుగానే అందమైన ప్రేమ కథ గా తెరకెక్కిన "ఇష్క్ " మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది. ఈ మూవీ కి పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ , డైలాగ్స్ , సంగీతం హైలైట్ గా నిలిచాయి. ప్రేక్షకాదరణ పొందిన "ఇష్క్ " మూవీ 11 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది.