
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


శివ నిర్వాణ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా టక్ జగదీష్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇక ఈసినిమాను మొదట థియేటర్లలో రిలీజ్ చేద్దామని అనుకున్నా కొన్ని పరిస్థితుల వల్ల ఫైనల్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈవిషయాన్ని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు కూడా. సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది టక్ జగదీష్.