
ట్యాగ్ · 2 కథనాలు

సిస్టర్ నయనతార నీకు హ్యాపీ బర్త్ డే

నయన తారను కన్ఫామ్ చేసిన 'గాడ్ ఫాదర్' టీమ్
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ తో మోహన్ రాజా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో నయనతార నటిస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. లూసిఫర్ లో మంజు వారియర్ చేసిన పాత్రను నయనతార చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే వార్తలయితే వస్తున్నాయి కానీ దీనిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక తాజాగా నయనతార పుట్టిన రోజు సందర్భంగా తను ఈసినిమాలో నటిస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈమేరకు చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా ఈవిషయాన్ని తెలియచేస్తూ…
సిస్టర్ నయనతార నీకు హ్యాపీ బర్త్ డే
లేడీ సూపర్ స్టార్ నయన తార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నయన్ కు అభిమానులతో పాటు పలువురు సినీ సీలెబ్రిటీస్ కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు. ఇక ఈనేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా తనట్విట్టర్ ద్వారా నయన్ కు బర్త్ డే విషెస్ తెలియచేసారు. వన్ అండ్ ఓన్లీ నయనతారకు హ్యాపీ బర్త్ డే.. నువ్వు మరింతగా వెలగాలి. మనదైన దాని కోసం పోరాడే స్ఫూర్తిని మాలాంటి వాళ్లకి కలిగించాలి. నీకు మరింత బలం చేకూరాలి. సిస్టర్.. నీ బలానికి, పట్టుదలకు సెల్యూట్’ అంటూ ట్వీట్ చేసింది.