
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం "నరగాసురన్ ", "కసడ తపర "(తమిళ ), "వివాహభోజనంబు" (తెలుగు ) మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన "గల్లీ రౌడీ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ రైటర్ కోన వెంకట్ సమర్పణలో ఎమ్ వి వి సినిమాస్ బ్యానర్ పై జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ , నేహా శెట్టి జంటగా "గల్లీ రౌడీ " మూవీ తెరకెక్కింది. బాబీ సింహా , రాజేంద్ర ప్రసాద్ , పోసాని , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. చౌరస్తా రామ్ సంగీతం అందించారు.