
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


"బాచి "మూవీ తో సింగర్ గా పరిచయం అయిన రఘు కుంచె సుమారు 700 సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. సక్సెస్ ఫుల్"బంపర్ ఆఫర్" మూవీ తో రఘు సంగీత దర్శకుడిగా మారారు. ఆ మూవీ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు.సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రఘు కుంచె సక్సెస్ ఫుల్ "పలాస 1978’" మూవీ లో విలన్‌గా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. రఘుకుంచె ఇప్పుడు మరో మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.