
ట్యాగ్ · 3 కథనాలు


గుడ్ బ్యాడ్ అగ్లీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ స్టార్ట్

హైద్రాబాద్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ కీలక షెడ్యూల్
స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన వెర్సటైల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఎక్సయిటింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అజిత్ కుమార్‌ని మూడు డిఫరెంట్ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

గుడ్ బ్యాడ్ అగ్లీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
తమిళ హీరో తల అజిత్-మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అద్విక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈరోజుతో పూర్తయింది.హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన ఈ షెడ్యూల్ లో ఫైట్ సీక్వెన్స్ తోపాటు ఇంట్రో సాంగ్ ను షూట్ చేశారు. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. రీసెంట్ గా విడుదలైన అజిత్ ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాలో ప్రేమలు హీరో నస్లేన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది.

గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ స్టార్ట్
తల అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభమైంది.ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఓ మాస్ ఇంట్రో సాంగ్ తో పాటు ఫైట్ సీక్వెన్స్ ను కూడా చిత్రీకరించనున్నారు. మార్క్ ఆంటోనీ ఫేమ్ అద్విత్ రవి చంద్రన్ ఈసినిమా ను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ను నిర్మిస్తుంది.తమిళ స్టార్ హీరో తో మైత్రి సినిమా చేయడం ఇదే తొలిసారి. ఈసినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది. ఈసినిమా పై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.