
ట్యాగ్ · 1 కథనాలు


సాంగ్
మహేష్ చేతుల మీదుగా 'లవ్ స్టోరీ' పాట
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'లవ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16 వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా అది కూడా పూర్తి కావస్తుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విడుదల చేసిన సారంగధరియ పాట మాత్రం సాయి పల్లవి కెరీర్ లో మరో హిట్ సాంగ్ గా నిలిచిపోయింది. ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తుంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.