
రిలీజ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


సిద్దూ హీరోగా వస్తోన్న లేటెస్ట్ చిత్రం డీజే టిల్లు. ఈసినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టి పాటలు, టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా యూత్ ఫుల్ కంటెంట్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిన తరువాత మళ్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు.. అయినా కూడా ఈసినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ డేట్ మాత్రం ప్రకటించలేదు. అయితే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమాను ఫిబ్రవరి 12న రిలీజ్ చేస్తున్నారు…