
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


తెలుగు తెరకి అపురూప చిత్రాలను అందించిన సీనియర్ డైరెక్టర్ వంశీ. ఆయన కథలు వాస్తవానికి దగ్గరగా .. ఆయన కథల్లోని పాత్రలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. అంతేకాదు ఒక సినిమాను చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేసే డైరెక్టర్ వంశీ. ఇక డైరెక్టర్ వంశీ అంటే మనకు ముందు సితార, లేడీస్ టైలర్, అన్వేషణ ఈ సినిమాలే గుర్తొస్తాయి. కానీ లేడీస్ టైలర్ కంటే ముందే వంశీ చిరు తో కూడా ఒక సినిమా చేసిన సంగతి చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు. అసలు సంగతేంటంటే లేడీస్ టైలర్ కంటే ముందే చిరు తో మంచు పల్లకి సినిమా చేసాడు. ఇక ఈ సినిమాపై వంశీ ఒక ఇంటర్వ్యూ లో చెపుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు. నిజానికి అది తమిళ్ సినిమాను. దాన్ని తెలుగులో…