
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.“లైగర్” మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన సంగతి తెలిసిందే. "లైగర్" సినిమా నిర్మాణ క్రమంలో కరణ్ జోహార్ తో పూరి, ఛార్మిలకు మంచి అనుబంధం ఏర్పడింది.