సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
"తగ్గేదే లే"
హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ "దువ్వాడ జగన్నాథమ్ "మూవీ కమర్షియల్ గా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ హీరో అల్లు అర్జున్ ను కలిశారు. వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ రానుందా అని ప్రేక్షకులకు సందేహం వచ్చింది. "పుష్ప :ది రైజ్"మూవీ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న అల్లు అర్జున్ "పుష్ప :ది రూల్"మూవీ కై ప్రిపేర్ అవుతున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ "భవదీయుడు భగత్ సింగ్"మూవీ తెరకెక్కించే సన్నాహాలలో ఉన్నారు.