
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


సక్సెస్ కు మారుపేరైన దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్, శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థల తో టాలీవుడ్ లో విజయ కేతనం ఎగురవేస్తున్నారు. బ్లాక్ బస్టర్ "దిల్ " మూవీ తో నిర్మాత గా టాలీవుడ్ కు పరిచయం అయిన దిల్ రాజు అనేక సూపర్ డూపర్ హిట్ సినిమాలను నిర్మిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సుకుమార్, బోయపాటి శ్రీను , వంశీ పైడిపల్లి, బొమ్మరిల్లు భాస్కర్, శ్రీకాంత్ అడ్డాల, వాసు వర్మ, వేణు శ్రీరామ్ లను దర్శకులుగా టాలీవుడ్ కు పరిచయం చేసిన ఘనత ఆయనదే . సినిమా తోడిదే లోకం, సినిమాలతో మమేకమై సక్సెస్ మంత్రం తెలుసుకొన్న దిల్ రాజు ఖర్చుకు వెనుకాడకుండా సినిమాలు నిర్మిస్తూ విజయాలు…