
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


ప్రముఖ నిర్మాత దిల్ రాజు ,స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్, జీ5 సంస్థ సంయుక్త నిర్మాణంలో సి చంద్ర మోహన్ దర్శకత్వంలో వీజే సన్నీ, దివి జంటగా దొంగతనాల నేపథ్యంలో తెరకెక్కుతున్న "ATM " వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు కుటుంబం నుండి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ వెబ్ సిరీస్ తో నిర్మాతలుగా మారుతున్నారు. దిల్ రాజు క్లాప్ కొట్టగా, హరీశ్ శంకర్ స్క్రిప్ట్ ను అందించారు. ఈ పూజా కార్యక్రమానికి వీజే సన్నీ, నటుడు సుబ్బరాజు, ప్రశాంత్ విహారి, హన్షిత రెడ్డి తదితరులు హాజరయ్యారు.