
ట్యాగ్ · 2 కథనాలు


"ఢీ " సీక్వెల్ అప్ డేట్

నాపై వచ్చిన వార్తల్లో నిజం లేదు..
కమర్షియల్ సినిమాలకు కామెడీ యాంగిల్ ను జోడించి ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్లలో శ్రీనువైట్ల పేరు ముందే ఉంటుంది. తన సినిమాల్లో ఉండే కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు వరుస హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా ఉన్నా ఇప్పుడు మాత్రం కాస్త స్లోఅయ్యాడు. దానికి వరుసపరాజయాలే కారణమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు చాాలా గ్యాప్ తరువాత మళ్లీ ఢీ సీక్వెల్ తో అలరించడానికి వస్తున్నాడు. ఈ సినిమాను గత ఏడాదే ప్రకటించారు. కానీ కరోనా వల్ల ఆగిపోయింది.ఈసినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

"ఢీ " సీక్వెల్ అప్ డేట్
సిరి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు మంచు , జెనీలియా జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "ఢీ "మూవీఘనవిజయం సాధించింది. శ్రీహరి , చంద్ర మోహన్ , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటించారు. చక్రి సంగీతం అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు శ్రీను వైట్ల "ఢీ "మూవీ ని తెరకెక్కించారు. తమిళ , బెంగాలీ భాషలలో రీమేక్ జరుపుకుని "ఢీ "మూవీ విజయం సాధించింది.